Powered By Blogger

Wednesday, 30 December 2015

Appu Chesi Pappu Koodu || Moogavaina Emi Full Video Song || NTR, Savitri...





జగయ్య గారి జయంతి సందర్భంగా ఈ సన్నివేశం, పాట ఓసారి స్మరించుకుందాం.

Monday, 28 December 2015

పింగళి నాగేంద్రరావు - నివాళి


పింగళి నాగేంద్రరావు గారి జయంతి సందర్భంగా నా నివాళి. వీరు ఒక తెలుగు సినిమా రచయిత మాత్రమే కాదు. పాత్రికేయుడు, నాటక రచయిత కూడా. కృష్ణా పత్రిక, శారద పత్రికల్లో ఆయన ఉపసంపాదకుడుగా పనిచేసారు. వింధ్య రాణి, నా రాజు, జేబున్నీసా, మేవాడు రాజ్య పతనం, క్షాత్ర హిందు, నా కుటుంబం, గమ్మత్తు చావు తదితర నాటకాలు ఆయన రాసినవే. వీరు ఒక రచయితగా తెలుగు సినీ రంగానికి చేసిన సేవ ఎంత విశిష్టమయినదో ఈ క్రింది చిత్రాలే చెబుతాయి.
రాజకోట రహస్యం (1971) గీతరచన
అగ్గిమీద గుగ్గిలం (1968) (కథ, సంభాషణలు, గీతాలు)
సి.ఐ.డి (1965) (రచయిత)
శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) (చిత్రానువాదం)
మహామంత్రి తిమ్మరుసు (1962) (రచయిత)
గుండమ్మ కథ (1962) (చిత్రానువాదం)
జగదేకవీరుని కథ (1961) (రచయిత)
మహాకవి కాళిదాసు (1960/I) (సంభాషణలు) (చిత్రానువాదం)
అప్పు చేసి పప్పు కూడు (1959) (గీతరచన)
పెళ్ళినాటి ప్రమాణాలు (1958) (సంభాషణలు) (కథ)
మాయా బజార్ (1957/I) (సంభాషణలు) (కథ) (చిత్రానువాదం)
మిస్సమ్మ (1955) (రచయిత)
చంద్రహారం (1954) (రచయిత)
పాతాళ భైరవి (1951) (సంభాషణలు) (కథ)
గుణసుందరి కథ (1949) (సంభాషణలు)
వింధ్యరాణి (1948) (సంభాషణలు) (కథ)
భలే పెళ్లి (1941) (గీతరచన)
శ్రీకృష్ణ లీలలు (1935) (సంభాషణలు).
(సేకరణ: వికీపీడియా)

Wednesday, 23 December 2015

పి. భానుమతి - పెన్సిల్ చిత్రం - ఆడుగడుగో అల్లడుగో అభినవనారీ మన్మధుడు


భానుమతి, ఎన్టీఆర్ నటించిన 'సారంగధర' చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. సారంగధరుని వర్ణిస్తూ ఆమె పాడిన ఈ అద్భుత గీతం, అంతకు తగ్గటుగా ఠీవి, దర్పం తో నడచి వస్తున్న ఎన్టీఅర్, ఈ పాట చిత్రీకరణ వెరసి  నభూతో నభవిష్యతి అనిపించాయి. భానుమతి గారి వర్ధంతి సందర్భంగా ఆమెకు నా నివాళి.

Thursday, 17 December 2015

సూర్యకాంతం



తెలుగువారికి పరిచయం అవసరంలేని అసమాన సహజనటి సూర్యకాంతం గారు. నేడు ఆ మహానటి వర్ధంతి సందర్భంగా నా స్మృత్యంజలి. (ఇది నేను వేసిన పెన్సిల్ చిత్రం).

Monday, 14 December 2015

My Slideshow - Art by Ponnada Murty - Inspiration Bapu





నేడు అసమాన చిత్రకారుడు, చిత్ర దర్శకుడు బాపు జయంతి. ఆ మహా మనీషి కి నా నివాళులు అర్పిస్తూ ఈ వీడియో. .

Friday, 11 December 2015

ఎమ్మెస్. సుబ్బులక్ష్మి - పెన్సిల్ చిత్రం


ఈ రోజు అమరాగాయని ఎమ్మెస్. సుబ్బులక్ష్మి వర్ధంతి. ఆ  మహా గాయానికి నా పెన్సిల్ చిత్రం ద్వారా ఘన నివాళి.
మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (సెప్టెంబర్ 161916 – డిసెంబర్ 112004), (ఎం.ఎస్.సుబ్బులక్ష్మిలేదా ఎం.ఎస్.గా ప్రాచుర్యం పొందారు), సుప్రఖ్యాతురాలైనకర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. - వికీపీడియా

Saturday, 5 December 2015

ఘంటసాల - ఆదిభట్ల నారాయణదాసు - కళావర్ రింగ్


'కళావర్ రింగ్' అనబడే సరిదే లక్ష్మీనరసయమ్మ గురించి టూకీగా :
చతుర్బాణాలనే అభినయంలో ఉపయోగించాలి కానీ, నీవు పంచ బాణాళు ఉపయోగించావు. అందువల్ల స్థలం మైల పడింది. అందు చేత కళామ తల్లికి కలిగిన ఈ కళంకాన్ని భరించలేక ఈ రూపంలో నీకు తెలియ జేయవలసి వచ్చింది. అని అనడంతో సాష్టాంగ దండ ప్రణాలు ఆచరించి, తన బసకు తీసుకుపోయి, పండితు లిద్దరినీ సత్కరించి, కానుక లిచ్చి గౌరవించి శాస్త్రిగారి శిష్యురాలిగా చేరిపోయింది.
పాటకత్తెగానూ, ఆతక్త్తెగానూ ప్రశస్తి గాంచిన 'కళావర్ రింగ్.'
కచేరీ నృతానికీ కర్ణాటక నృత్యానికీ కొత్త మెరుగులు దిద్ది, విజయనగరం రాజ నర్తకిగా, నాటకరంగ నటిగా, అమర గాయనిగా, చలన చిత్ర నటీమణిగా రసిక హృదయాలని రంజింపజేసిన కళాకారిణి కళావర్ రింగ్ అనే పేరుతో చెలామణి అయిన అయిన శ్రీమతి సరిదె లక్ష్మీనర్సయ్యమ్మ. ఈవిడ విజయనగరానికి 8 మైళ్ళ దూరంలో వున్నకోరుకొంద గ్రామంలో 1908 లో జన్మించింది. 8 వ ఏటనే నర్తకిగా పేరు తెచ్చుకుంది. 5 వ తరగతి వరకూ ప్రాథమిక విదాభ్యాసం చేసి శ్రీ మద్ది లచ్చన్నగారి వద్ద సరిగమలు ప్రారంబించి, శ్రీ ద్వారం వెంకతస్వామి నాయుడు శిష్యులైన శ్రి మద్దిల సత్య మూర్తి, శ్రీ చాగంటి రంగ బాబు, శ్రీ కోటి పల్లి గున్నయ్య మొదలైన వారి వద్ద సమగ్ర సంగీత జ్ఞానం సంపాదించింది. నృత్య విద్యలో శ్రీమతి మద్దిల అప్పుడు, శ్రీమతి మద్దిల రాముడు వద్ద శిక్షణ పొందింది. మద్దిల హేమావతి, నరహరమ్మల వద్ద హిందూస్థానీ జావళీలు, క్షేత్రయ్య పదాభినయనం నేర్చుకుంది. 12 సంవత్సరాల వయస్సులోనే భోగం మేళం నాయకురాలుగా వ్వవహరిందింది. ఆమే నృత్యానికి అచ్చెరువందిన ప్రేక్షకులు ఆమెను కళావర్ రింగ్. అని పిలిచేవారు.  - పొన్నాడ మూర్తి 

Friday, 30 October 2015

సర్దార్ వల్లభభాయి పటేల్ - పెన్సిల్ చిత్రం.


ఈ రోజు (31.10) సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి. ఐరన్ మ్యాన్ అఫ్ ఇండియా, గా పేరొందిన ఆ మహనీయునికి నా నివాళి.

Thursday, 29 October 2015

బాపు చిత్రాలు - రంగులు నావి


'Bapu's drawing colourised by me.
నాచేత రంగులద్దించుకున్ననలుపుతెలుపుల బాపు బొమ్మ.

Friday, 23 October 2015

అమర గాయకుడు మన్నా డే కి నా ఘన నివాళి - నా పెన్సిల్ చిత్రం


ఈ రోజు అమర గాయకుడు మన్నా డే వర్ధంతి. ఈ సందర్భంగా నా పెన్సిల్ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించుకుతున్నాను.

Monday, 29 June 2015

బాపు


బాపు గారింటికి రోజూ ఒకాయన వచ్చి మాటలతో ఆయన్ను విసిగించేవాడు. అందువల్ల బాపూకి ఎంతో విలువైన కాలం వృధా అయిపోయేది. ఓ రోజు సాయంత్రం ఆ వ్యక్తి వచ్చి, "నిన్న నేను ఇక్కడకు వచ్చానుగాని, మీ దగ్గరికి రాలేకపోయాను" అన్నాడు నొచ్చుకుంటూ.

"థాంక్స్!" అన్నారు బాపు ముక్తసరిగా.

అప్పటినుండి ఆ వ్యక్తి బాపు ఇంటికి రావడం మానేశాడు.
(సేకరణ ః 1993 ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికనుండి)

Tuesday, 23 June 2015

మామ - అప్పూ


మామ – అప్పూ
………………..
బాపు రమణలకు రచయితగా ఆరుద్ర గారితో ఎంత సాన్నిహిత్యం ఉందో, సంగీత దర్శకుడిగా కె.వి.మహాదేవన్ గారితో అంతే సాన్నిహిత్యం ఉంది. మహాదేవన్ గారు జీవించి ఉన్నంత కాలం, ఒకటి, రెండు సినిమాలు తప్ప బాపు రమణలకు మహదేవన్ గారే సంగీత దర్శకులు. బాపు రమణల తొలి చిత్రం “ సాక్షి” చిత్రంతో ప్రారంభం అయిన వారి ప్రయాణం, మహాదేవన్ గారు చేసిన “శ్రీనాధ కవిసార్వబౌమ” వరకు సాగింది. తెలుగు వాడు కాకపోయినా, తెలుగు వారి జానపద, సంప్రదాయ సంగీత రీతులను ఒడిసి పట్టుకున్న మహాదెవన్ అంటే బాపు రమణలకు అత్యంత అభిమానం. సినిమా రంగంలో “మామ” అని అందరూ ఆప్యాయంగా పిలుచుకొనే మహాదేవన్, బాపు రమణల సాక్షి, బుద్ధిమంతుడు, బాలరాజు కధ, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, గోరంతదీపం, పెళ్ళిపుస్తకం మొదలైన చిత్రాలకు అత్యంత మధురమైన సంగీతం అందింఛారు. సంపూర్ణ రామాయణంలో శబరి పాత్ర పై చిత్రీకరించిన "ఎందుకో కొలను నీరు ఉలికి ఉలికి పడుతోందీ" వంటి పాటలను ఎవరు మరువగలరు?
..
మహాదేవన్ గారి సహాయకులు శ్రీ పుహళేంది గారు. ఈయనిని అందరూ “అప్పూ” అని పిలిచే వారు. మళయళీ అయినా తెలుగు బాగా తెలిసిన వాడు. తెలుగు పాటలోని అర్థాన్ని మహాదేవన్ గారికి వివరించి చెప్పేవారు. మహాదేవన్ ట్యూన కట్టగానే హార్మోనియం మీద వాయించో, లేక పాడో గాయనీ గాయకులకు వినిపించేవారు.
..
వారిద్దరి మీద అభిమానంతో బాపు గారు గీసుకున్న బొమ్మ ఇది.


(courtesy : Umamaheswar Rao Ponnada)

Thursday, 18 June 2015

విప్లవ వాల్మీకి ఆరుద్ర


విప్లవ వాల్మీకి

బాపు-రమణలకు, ఆరుద్ర అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆరుద్ర జీవించినంత కాలం బాపు రమణల సినిమాలలో ఆరుద్ర పాట లేకుండా ఒక్క సినిమా కూడా తీయలేదు. ఆరుద్ర నాస్తికుడు, కమ్యూనిష్టు భావజాలం కలవాడు. అయినా ఆరుద్ర శ్రీ రాముని మీద అధ్భుతమైన పాటలు, పద్యాలు వ్రాసారు. “సంపూర్ణ రామాయణం” సినిమా తీస్తున్నప్పుడు “ఒకడు కార్టూనిష్టు, మరొకడు హ్యూమరిస్టు, ఇంకో ఆయన కమ్యూనిష్టు. ఈ సినిమా ఫ్లాప్ అవడం ఖాయం” అని అందరూ గేలి చేశారుట. కానీ ఆ సినిమా అఖండ విజయం సాధించింది. దానికి కారణం ఆరుద్రే ! “ వెడలెను కోదండ పాణి” వంటి సుదీర్ఘ కధా కధనంతో పాటు, సరళ మైన సంభాషణలు, గుహుని పాత్ర పై వ్రాసిన “రామయ్య తండ్రీ” వంటి పాటలు ఆ సినిమాకు అఖండ విజయాన్ని అందించాయి. శ్రీ రామాంజనేయ యుధ్ధం సినిమాలో “శ్రికరమౌ శ్రీ రామ నామం” పాటలో శ్రీ రాముడిని వివిధ కోణాలలో ఆరుద్ర వర్ణించిన విధానం బాపు రమణలకు ఎంతగానో నచ్చిందట. ఇక ఆరుద్ర వ్రాసిన “రాయినైనా కాక పోతిని” ప్రైవేటు గీతం విని, బాపు రమణలు ముగ్ధులైపోయి, గ్రామఫోన్ కంపెనీ వారి వద్ద ఆ గీతం హక్కులు తీసుకొని., తమ “గోరంత దీపం” చిత్రంలో పెట్టుకున్నారు. మరొక కవి సి. నారాయణ రెడ్డి ఆ పాట విని “జీవిత కాలంలో ఇలాంటి పాట ఒక్కటి వ్రాస్తే చాలు, జన్మ ధన్యం అయిపోతుంది” అని మెచ్చుకున్నారు. “సీతా కళ్యాణం” సినిమాలో “సీతమ్మకు సింగారము చేతుము రారమ్మ” బాపు రమణల సినినమాకు ఆరుద్ర వ్రాసిన గొప్ప పాటలలో ఒకటీ. ఆరుద్ర చివరి రోజులలో అనారోగ్యంతో ఉన్నా, బాపు రమణల “శ్రీ భాగవతం” టీ.వి, సీరియల్ కోసం సుందరకాండని అరవై నిముషాల పాటగా ఇచ్చి ఆ సీరియల్ నిర్మాణం పూర్తికాకముందే నిష్క్రమించారు.. ముళ్ళపూడి చెప్పినట్లు ఆరుద్ర అక్షర శరీరుడు, పరిశోధనా పరమేశ్వరుడు. నాస్తికుడైనా, శ్రీ రామ తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఆరుద్ర వాళ్ళిద్దరి దృష్టిలో “విప్లవ వాల్మీకి”.

(courtesy : Umamaheswara Rao Ponnada garu)

Sunday, 14 June 2015

బుచ్చిబాబు


ప్రముఖ రచయిత బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు) జయంతి నేడు. 1916 June 14న జన్మించిన బుచ్చిబాబుకి ఇది శత జయంతి సంవత్సరం . 
బుచ్చిబాబు అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ చివరకు మిగెలేది అంటే బుచ్చిబాబు నిస్సందేహంగా గుర్తుకొస్తాడు. బెంగాలీ సాహిత్యమే సాహిత్యం అని ప్రచారం జరుగుతున్న రోజుల్లో, స్వంత ఆలోచనలతో, అభ్యుదయ భావాలతో, మనస్తత్వ విశ్లేషణలతో తెలుగు సాహిత్యాన్ని కుదెపేసిన అడవి బాపిరాజు, చలం, కొడవటిగంటి, గోపిచంద్ వంటి వారి సరసన చేర్చదగ్గ వ్యక్తి బుచ్చిబాబు. 1945-67ల మధ్య ఆకాశవాణిలో పనిచేసారు.
ఆంగ్ల సాహిత్యంలో M.A. చేసిన బుచ్చిబాబుపై బెర్ట్రాండ్ రస్సెల్ ప్రభావం కొంత వరకూ పడినా, లోతైన ఆలోచనలతో, చైతైన్య స్రవంతి (Stream of consciousness) ప్రక్రియతో తనదైన స్వంత గొంతుకని వినిపించాడు ఆయన.
కధకునిగా - మేడమేట్లు, నన్ను గురించి కధ వ్రాయవూ?, కలలో జారిన కన్నీరు, తడిమంటకు పొడినీళ్ళు వంటి విశిష్టమైన 82 కధలను వ్రాసారు.
ఆయన వ్రాసిన ఏకైక నవల “చివరకు మిగిలేది”. 1946-47లో నవోదయ పత్రికలో సీరియల్ గా వచ్చి తెలుగు సాహిత్యంలో అజరామరంగా (All time classic) నిలిచిపోయింది. 1952లో నవల రూపంలో ప్రచురింపబడి, ఆ తరువాతి మలిముద్రణలలో సహితం బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 
నాటక రచయితగా బుచ్చిబాబు అనేక రేడియో నాటికలు వ్రాసారు. ఆయన వ్రాసిన “ఆత్మవంచన” నాటిక రేడియోలో వచ్చింది. అందులో సావిత్రి, పుండరీకాక్షయ్య వంటి వారు నటించేవారు. తెలుగు సినీ కళాఖండం “మల్లీశ్వరి” సినిమాకు బుచ్చిబాబు వ్రాసిన “కృష్ణదేవరాయల కరుణ కృత్యం” నాటిక ఆధారం. ఆత్మవంచన నాటిక 1955లో ఆంధ్ర కళాపరిషత్ వారు కాకినాడలో ప్రదర్శించినప్పుడు, ఉత్తమ ప్రదర్శనగా ఎన్నికై, హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
వ్యాసకర్తగా – నన్ను మార్చిన పుస్తకం, నేను-శంకరనారాయణ నిఘంటువు వంటి రచనలు చేసారు. షేక్స్ పియర్ రచనల మీద “షేక్స్ పియర్ సాహితీ పరామర్శ” పరిశోధనకి గాను సాహిత్య ఎకాడమీ అవార్డు అందుకున్నారు.
చిత్రకారునిగా కూడా ప్రతిభ కలవారు బుచ్చిబాబు. ఆయన 1940-60ల మధ్య దక్షిణభారత దేశాన్ని తన పెయింటీంగ్సులో, ల్యాండ్ స్కేప్ లలో చిత్రీకరించారు. 1955లో ఆకాశవాణి, విజయవాడ ప్రాంగణంలో ఆయన చిత్ర ప్రదర్శన కూడా జరిగింది. 
1967 లో 51 ఏళ్ళ పిన్న వయస్సుకే జీవితం చాలించిన బుచ్చిబాబు, తెలుగు సాహిత్యంలో ఒక మహోజ్వల తార. పాలగుమ్మి పద్మరాజు శతజయింతిని విస్మరించిన మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, బుచ్చిబాబు శత జయంతిని అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది

(courtesy : Umamaheswara Rao Ponnada).

బుచ్చెమ్మ - గురజాడ వరి 'కన్యాశుల్కం' నాటకం లో ఓ పాత్ర - ప్రేరణ : BAPU


గురజాడ వారి కన్యాశుల్కం లో 'బుచ్చెమ్మ పాత్ర కి నా బొమ్మ - ప్రేరణ స్వర్గీయ 'బాపు'

Wednesday, 27 May 2015

NTR - గిరీశం - కన్యాశుల్కం - పెన్సిల్ చిత్రం


నేడు ఎన్టీఆర్ జయంతి - ఆ మహానటునికి నా  స్మ్రుత్యంజలి  

Tuesday, 26 May 2015

కరువు రోజులు - నాటకం


ఎన్టీఆర్ నటించిన సినిమా ఫోటోలు చాలానే చూసాం. మరి ఎన్టీఆర్, గుమ్మడి, పేకేటి నటించిన 'కరువు రోజులు" నాటకంలో ఫోటో కూడా చూడండి.

Friday, 22 May 2015

NTR ANR






NTR ANR - చరిత్ర సృష్టించిన ఇలాంటి మూడక్షరాల మహానటులు మరే చిత్ర పరిశ్రమలోనూ లేరేమో..!!
(photo courtesy : 'సితార' 9.2.2014)

Thursday, 21 May 2015

BAPU - శ్రద్ధాంజలి


సాధన కోసం అలనాటి బాపు బొమ్మ - ఫోటోషాప్ లో రంగులు

Saturday, 16 May 2015

Tuesday, 12 May 2015

Wednesday, 6 May 2015

రవీంద్రనాథ్ టాగూర్


నేడు రవీంద్రుని జయంతి - మన దేశానికి జాతీయ గీతాన్ని అందించి, 'గీతాంజలి' స్రుష్టికర్త అయిన ఈ విశ్వకవి కి నా రేఖా చిత్రం ద్వారా స్మ్రుత్యంజలి ఘటిస్తున్నాను.

Monday, 4 May 2015

నౌషాద్ - స్మ్రుత్యంజలి


భారత దేశం గర్వించదగ్గ అద్భుత సంగీత కారుల్లొ ఒకరు నౌషాద్. ఈ రోజు వారి పుణ్యతిధి. వారి సంగీత దర్శకత్వంలో వచ్చిన 'బైజు బావరా'. 'మొగలే ఆజమ్', 'మేరే మెహబూబ్', 'మదర్ ఇండియా' ఇత్యాది చిత్రాలు నాటికీ నేటికీ చిరస్థాయి గా నిలిచిపోయాయి.

Saturday, 2 May 2015

సత్యజిత్ రాయ్ - నివాళి


అద్భుత చిత్ర నిర్మాత, దర్సకుడు సత్యజిత్ రాయ్ జయంతి నేడు (2nd May). ప్రపంచ ఖ్యాతి పొందిన ఈ చిత్ర దర్శకుని గురించి వికీపీడియా వారు ఇలా వ్రాస్తున్నారు -  పొన్నాడ మూర్తి

Satyajit Ray - (2 May 1921 – 23 April 1992) was an Indian filmmaker who worked prominently in Bengali cinema and who has often been regarded as one of the great directors of world cinema. Ray was born in Calcutta (now Kolkata) to a Bengali family and started his career as a junior visualiser. His meeting with French film director Jean Renoir, who had come to Calcutta in 1949 to shoot his film The River (1951), and his 1950 visit to London, where he saw Vittorio De Sica's Ladri di biciclette (Bicycle Thieves) (1948), inspired Ray to become a film-maker. Ray made his directorial debut in 1955 withPather Panchali and directed 36 films, comprising 29 feature films, five documentaries and two short films.
Ray received numerous awards at international film festivals and elsewhere, including several Indian National Film Awards and an honorary Academy Award at the64th Academy Awards in 1992.  Ray was awarded India's highest award in cinema, the Dadasaheb Phalke Award, in 1984 and India's highest civilian award,Bharat Ratna, in 1992

Thursday, 30 April 2015

గోపులు చిత్ర శైలి


స్వర్గీయ తమిళ చిత్రకారుడు గోపులు  గారి చిత్ర శైలి ఎలా ఉంటుందో మన బాపు గారు వేసి చూపించారు. నేను అలా వేసుకుని రంగులు నింపుకున్న బొమ్మ ఇది. నిన్న స్వర్గస్తులయిన గోపులు గారికి శ్రద్ధాంజలి.

గోపులు (తమిళ చిత్రకారుడు) కి శ్రద్ధాంజలి


Tribute to Gopulu, the renowned artist from Tamil Nadu who passed away yesterday. He was 91. Late Bapu garu always used to say that Gopulu garu was his guru. 
గొపులు గారి చిత్ర శైలి బాపు గారిని ఎంతలా ప్రభావితం చేసిందో గోపులు గారు ఓ magazine కవర్ కి వేసిన ఈ బొమ్మ ద్వారా తెలుస్తుంది.

మహాకవి శ్రీశ్రీ - పెన్సిల్ చిత్రం


మహాకవి శ్రీశ్రీ కి తన 105వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తూ నా పెన్సిల్ చిత్రం

' ఆశాన్వేషణలో అండగా నిలిచేది శ్రీశ్రీ కవిత్వం "

' ఆశాన్వేషణలో అండగా నిలిచేది శ్రీశ్రీ కవిత్వం "
*************************************************
ఇంత వరకు నడిచిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే. ఒక్క మాటలో చెప్పాలంటే పీడకులూ పీడితులూ నిరంతరం పరస్పర శత్రువులుగా నిలబడి ఒకప్పుడు ప్రచ్ఛన్నంగానూ పోరాటం చేస్తూనే వుంటారు. నరజాతి చరిత్ర సమస్తం.పరపీడన పరాయణత్వం, రణరక్తం ప్రవాహ సిక్తం...దరిద్రులను కాల్చుకు తినడం అన్నారు. అంతేకాదు ....రణరంగం కాని చోటు భూ స్థలమంతా వెదికినా దొరకదు. ఇలా పీడిత ప్రజల పక్షాన, పీడిత వర్గాలపై యుద్ధాన్ని ప్రకటించిన అక్షరయోధుడు. శ్రామిక, విప్లవ కవిత్వాలకు ఆద్యుడు. సామ్యవాద మరో ప్రపంచం కోసం లక్షలాది యువకులతో కవన కవాతు చేయించిన రణసేనాని. కష్టజీవులకు ఇరువైపులా నిలబడ్డవాడే కవి...! అని చాటి తన జీవితాంతం కష్టజీవులకు అటూ,ఇటూ నిలిచి శ్రమైక జీవన సౌందర్యాన్ని కవిత్వీకరించిన ప్రజాకళాకారుడు. తెలుగు సాహిత్యంలో సంస్కరణవాద స్తబ్దతను బద్దలుకొట్టి సమకాలీన ప్రజాపోరాటాల నండి తను తిరిగి స్ఫూర్తి పొందేవారు. దొంగనోట్ల దొంగవోట్ల రాజ్యం ఒక రాజ్యమా? లంచగొండి వెధవలిచ్చు / సాక్ష్యం.. ఒకసాక్ష్యమా? అంటూ అస్తవ్యవస్థను వివస్త్రీకరించిన శ్రీశ్రీ ''విప్లవం యాడుందిరా...ఆడనే కూడుందిరా.. నీ గూడుందిరా'' అంటూ విప్లవాన్ని వ్యవస్థీకరించిన శ్రీశ్రీ నూట ఐదేళ్ళ కిందట పుట్టి, ఎనభైఐదు ఏళ్ళకింద కలంపట్టి ముప్పైమూడేళ్ళ దాకా తెలుగు అనితర సాధ్యమైన స్థానం సంపాదించిన మహాకవి చనిపోయి నేటికి ముప్పై మూడేళ్ళు అయిన శ్రీశ్రీ ఇవాల్టికి ప్రతినోటా శ్రీశ్రీ కవిత్వం మాట లేని ఉపన్యాసం అరుదు. సాహిత్యం చెరిగిపోని సంతకం, స్థల కాలాలు మారినా, ఎదురుగాలులు వీచినా, పరిస్థితిలో అనేక మార్పులొచ్చినా'' శ్రీశ్రీ కవిత్వం చిరస్థాయిగా నిలిచే వుంటుంది. ఎందుకంటే ఈ సమాజం మారలేదు. సమాజానికీ వ్యక్తికీ సన్నిహిత సంబంధం చెదిరిపోని, నిరంతరం నూతనంగా, ఆదర్శంగా వుండే జీవ చలన రసాయనాలు తన కవిత్వంలో వున్నాయి. కనుకనే ఆయన కవిత్వానికి ఎన్నటికీ ఆదరణ తగ్గనే తగ్గదు. చలనశీలత, పురోగామి శక్తుల సాహచర్యం, ఆశావహదృష్టీ ప్రవాహశీలత ఆయనలోని ప్రత్యేకత...'' భావకవిత్వం ఫాసిస్టు వ్యతిరేక కవిత్వం నుంచి విప్లవ సాహిత్యోద్యమం సినిమా ప్రయోగ పర్వతం ఎక్కడ తడిమినా.... చలనశీల సాహిత్య సృజన చేసిన వాడాయన.. నడువలేనివారిని కూడా నడిపించే.. ఉరికించే ప్రవాహశక్తి వారి కవిత్వంలో వుంది. భవిష్య దిశాదృష్టిని తన కవన, కథ, నాటక, వ్యాసాల్లో రౌద్రంగా, ధ్వనిపూర్వకంగా చెప్పాడు. ''అగాథమగు జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే..! శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే..!! ఏదీ తనంత తానే నీ దరికి రాదూ... శోధించి సాధించాలీ... అదియే ధీర గుణం...!! '' ఆశాన్వేషణలో అండగా నిలిచేది శ్రీశ్రీ కవిత్వం. జీవ లక్షణాల కవిత్వం మానవ హృదయ ప్రేమతత్వం ఎప్పటికీ చెరిగిపోని సూర్యబింబం ఆయన ఎర్రని పెన్ను !! ఆయన మనందరికీ వెన్నుదన్నూ...!!
(శ్రీశ్రీ105 వ జయంతి సందర్భంగా)
భూపతి వెంకటేశ్వర్లు - Nava Telangana Apr.30,2015

Wednesday, 29 April 2015

Evi tallee nirudu kurisina himasamoohamulu - SreeSree sung by Ponnada L...





హ్రుదయాన్ని కదిలించిన మహాకవి శ్రీశ్రీ గారి అద్భుత కవిత. నేడు (30 April) సందర్భంగా వారికి స్మ్రుత్యంజలి ఘటిస్తున్నాను.

Friday, 24 April 2015

ఇది సంధ్యా సమయం - ఘంటసాల గారి అరుదయిన ప్రైవేట్ పాట


ఈ లింకు లో ఘంటసాల గారి 'సంధ్యా సమయం' అనే ప్రివేట్ పాట విని ఆనందించండి.

https://soundcloud.com/ponnada-murty-1/sandhya-samayam-ghantasala

Thursday, 23 April 2015

బాపు


బాపు గారు సినిమాల పబ్లిసిటీ కోసం బొమ్మలు వేసేవారు. అలా వేసినదే ఈ బొమ్మ. అయితే photoshop లో రంగులు మాత్రం నేను నింపాను.

బాపు - ఆర్.కే.లక్ష్మణ్


నా పెన్సిల్ చిత్రాల్లో చరిత్ర స్రుష్టించిన నా అత్యంత  అభిమాన చిత్రకారులు/కార్టూనిస్టులు  కీ.శే. బాపు,  ఆర్.కే.లక్ష్మణ్