………………..
బాపు రమణలకు రచయితగా ఆరుద్ర గారితో ఎంత సాన్నిహిత్యం ఉందో, సంగీత దర్శకుడిగా కె.వి.మహాదేవన్ గారితో అంతే సాన్నిహిత్యం ఉంది. మహాదేవన్ గారు జీవించి ఉన్నంత కాలం, ఒకటి, రెండు సినిమాలు తప్ప బాపు రమణలకు మహదేవన్ గారే సంగీత దర్శకులు. బాపు రమణల తొలి చిత్రం “ సాక్షి” చిత్రంతో ప్రారంభం అయిన వారి ప్రయాణం, మహాదేవన్ గారు చేసిన “శ్రీనాధ కవిసార్వబౌమ” వరకు సాగింది. తెలుగు వాడు కాకపోయినా, తెలుగు వారి జానపద, సంప్రదాయ సంగీత రీతులను ఒడిసి పట్టుకున్న మహాదెవన్ అంటే బాపు రమణలకు అత్యంత అభిమానం. సినిమా రంగంలో “మామ” అని అందరూ ఆప్యాయంగా పిలుచుకొనే మహాదేవన్, బాపు రమణల సాక్షి, బుద్ధిమంతుడు, బాలరాజు కధ, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, గోరంతదీపం, పెళ్ళిపుస్తకం మొదలైన చిత్రాలకు అత్యంత మధురమైన సంగీతం అందింఛారు. సంపూర్ణ రామాయణంలో శబరి పాత్ర పై చిత్రీకరించిన "ఎందుకో కొలను నీరు ఉలికి ఉలికి పడుతోందీ" వంటి పాటలను ఎవరు మరువగలరు?
..
మహాదేవన్ గారి సహాయకులు శ్రీ పుహళేంది గారు. ఈయనిని అందరూ “అప్పూ” అని పిలిచే వారు. మళయళీ అయినా తెలుగు బాగా తెలిసిన వాడు. తెలుగు పాటలోని అర్థాన్ని మహాదేవన్ గారికి వివరించి చెప్పేవారు. మహాదేవన్ ట్యూన కట్టగానే హార్మోనియం మీద వాయించో, లేక పాడో గాయనీ గాయకులకు వినిపించేవారు.
..
వారిద్దరి మీద అభిమానంతో బాపు గారు గీసుకున్న బొమ్మ ఇది.
(courtesy : Umamaheswar Rao Ponnada)
No comments:
Post a Comment