Powered By Blogger

Sunday 28 February 2016

రవీంద్ర జౖన్ - పెన్సిల్ చిత్రం - నివాళి


A blind man goes to a doctor.
Doctor says, “ Wait, I am busy!”.
The blind man says, “ Oh, I SEE”.

మామూలుగా అయితే ఇదొక్ జోక్ గా కొట్టి పారెయొచ్చు. పుట్టిన దగ్గరనుండి కళ్ళె తెరవని  అద్భుత సంగీత దర్శకుడు, గేయ రచయిత దర్శకుడు విషయంలో మాత్రం ఇది అక్షరాలా నిజం. అంధుడయినా అద్భుత గీతాలు వ్రాశాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఊహించుకుంటూ చక్కని బాణీలు సమకూర్చాడు.


'చిత్ చోర్' చిత్రంలో ప్రకృతి ని  వర్ణిస్తూ కథా నాయకుడు పాడే ‘గొరి తెరా గావ్ బడా ప్యారా” పాటని అంధుడైన రవీంద్ర జైన్ రాశాడంటే నమ్మలేం! అంతే కాదు, సంజ చీకట్లలో ముంగిట్లో వెలిగే దీపానికి కవిత్వాన్ని అద్ది, “జబ్ దీప్ జలే ఆనా” పాటని సృజించాడు రవీంద్ర జైన్. మిగతా సంగీత దర్శకులెంత గొప్ప పాటలకు బాణీలు కట్టినా,శ్రోతల మనసు పొరల్లోని జ్ఞాపకాలను తడిమే ఒక ‘లైఫ్ ‘ రవీంద్ర జైన్ సంగీతంలో ఉంటుందని ఈ సినిమాలోని పాటలు రుజువు చేస్తాయి., హిందీ చిత్ర రంగానికి జేసుదాస్ ని పరిచయం చేసిన విజయగీతాలు కూడా! 


అమితాబ్, నూతన్ నటించిన 'సౌదాగర్', రాజ్ కపూర్ నిర్మించిన 'రామ్ తెరీ గంగా మైలీ', 'దుల్హన్ వహీ జో పియా మన్ భాయె', రామానంద్ సాగర్ నిర్మించిన సూపర్ హిట్ సీరియల్ 'రామాయణ్' వంటి ఎన్నిటికో సంగీత దర్శ్కత్వం వహించిన రవీంద్ర జైన్ చిరస్మరణీయుడు. ఆ మహా సంగీత దర్శకుని జయంతి సందర్భంగా నా పెన్సిల్ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పిస్తున్నాను.

Thursday 25 February 2016

బి. నాగిరెడ్డి - స్మృత్యంజలి





ఈ రోజు తెలుగు చలన చిత్రసీమలో అద్భుతాలు సృష్టించిన బి. నాగిరెడ్డి వర్ధంతి. ఆ మహూన్నత వ్యక్తికి నా స్మృత్యంజలి.  వికీపీడియా వారు నాగిరెడ్డి గారు ఇలా వ్రాస్తున్నారు. ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకుందాం.

https://te.wikipedia.org/wiki/

Wednesday 24 February 2016

Talat Mehmood - A tribute - తలత్ మహమూద్ - నివాళి


Remembering Talat Mahmood, a great playback singer, Badshah of Ghazals and actor, on his birth anniversary today. I very much like this song of Talat. What a touching and beautiful song it is and how touchingly Talat Mahmood brought out the nuances. Click the following link and read on.


Tuesday 23 February 2016

పెదవుల నొక ముద్దిడగా - కీ. శే. నోరి నరసింహ శాస్త్రి గారు వ్రాసిన పద్యాలు - నా Pencil Sketch

పెదవుల నొక ముద్దిడగా
సదయత నొప్పితివి మేలు సకియా, ఇదె నా
పెదవుల గదించి పెదవులు
వదలను పలవశత ప్రాణి వదలెడు దాకన్

వదలర పెదవులు వదలర,
సద మద మయితిని గదయ్యొ సామీ యపుడే
వదలితి నీ ముద్దుల కీ
పెదవుల, నిక వదలి బ్రదికి బ్రదికింపు ననున్ !
(కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి  పద్యములు)


Tuesday 16 February 2016

దాదా సాహెబ్ ఫాల్క్ - భారతీయ సినిమా పితామహుడు - శ్రద్ధాంజలి


ఈ రోజు దాదా సాహెబ్ ఫాల్క్, భారతీయ సినిమా పితామహుడు, దాదా సాహెబ్ ఫాల్కె వర్ధంతి నేడు. నా పెన్సిల్ చిత్రం. ఆ మహా వ్యక్తి గురించి టూకీగా ః

ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగాడు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కాడు

ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke),  (ఏప్రిల్ 30,1870 - ఫిబ్రవరి 161944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి. . ఇతడి ప్రథమ సినిమా రాజా హరిశ్చంద్ర (భారతీయ మొదటి సినిమా) 1913. ఇతడు తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు, నిర్మించాడు. (సంకలనం ; వికీపీడియా నుండి)