A blind man goes to a doctor.
Doctor says, “ Wait, I am busy!”.
The blind man says, “ Oh, I SEE”.
మామూలుగా అయితే ఇదొక్ జోక్ గా కొట్టి పారెయొచ్చు. పుట్టిన దగ్గరనుండి కళ్ళె తెరవని అద్భుత సంగీత దర్శకుడు, గేయ రచయిత దర్శకుడు విషయంలో మాత్రం ఇది అక్షరాలా నిజం. అంధుడయినా అద్భుత గీతాలు వ్రాశాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఊహించుకుంటూ చక్కని బాణీలు సమకూర్చాడు.
'చిత్ చోర్' చిత్రంలో ప్రకృతి ని వర్ణిస్తూ కథా నాయకుడు పాడే ‘గొరి తెరా గావ్ బడా ప్యారా” పాటని అంధుడైన రవీంద్ర జైన్ రాశాడంటే నమ్మలేం! అంతే కాదు, సంజ చీకట్లలో ముంగిట్లో వెలిగే దీపానికి కవిత్వాన్ని అద్ది, “జబ్ దీప్ జలే ఆనా” పాటని సృజించాడు రవీంద్ర జైన్. మిగతా సంగీత దర్శకులెంత గొప్ప పాటలకు బాణీలు కట్టినా,శ్రోతల మనసు పొరల్లోని జ్ఞాపకాలను తడిమే ఒక ‘లైఫ్ ‘ రవీంద్ర జైన్ సంగీతంలో ఉంటుందని ఈ సినిమాలోని పాటలు రుజువు చేస్తాయి., హిందీ చిత్ర రంగానికి జేసుదాస్ ని పరిచయం చేసిన విజయగీతాలు కూడా!
his lyrics and music are immortal
ReplyDelete