Powered By Blogger

Saturday 30 January 2016

జనరల్ కె.వి. కృష్ణారావు - శ్రధ్ధాంజలి


శ్రద్ధాంజలి - తెలుగు తల్లి ముద్దుబిడ్డ, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కొటికలపూడి వెంకట కృష్ణారావు (93) శనివారం తుదిశ్వాస విడిచారు. 1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. జులై 11, 1989 నుంచి జనవరి 19, 1990 వరకు తొలిసారి జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండోసారి మార్చి 13, 1993, నుంచి 1998 వరకు గవర్నర్‌గా సేవలందించారు. కేవీ కృష్ణారావు 1923లో విజయవాడలో జన్మించారు. 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో ఆయన సేవలందించారు. బ్రిటిష్ ఇండియా ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆయన యువ ఆఫీసర్‌గా బర్మాలో, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బెలుచిస్తాన్‌లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ ఇచ్చి సత్కరించింది.

1 comment:

  1. ఓ తెలుగు వ్యక్తి సేనాధిపతి అయినందుకు, దేశానికి అంతటి సేవలందించినందుకు మనమంతా గర్వించాలి. RIP.

    ReplyDelete