Powered By Blogger

Saturday, 2 January 2016

హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు - స్మృత్యంజలి



అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (Ajjada Adibhatla Narayana Dasu) ప్రముఖ హరికథా కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.
1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.
ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు. (వికీపెడియా నుండి సేకరణ)

ఈ బొమ్మ చూసి శ్రీమతి శశికళ ఓలేటి గారు తన పద్యాల ద్వారా ఇలా స్పందించారు :

కందము. ****** 1. అజ్జాడ దిగ్గజము యదె, విజ్జయ నగరమున బుట్టి, వినుతిని బొందన్. యొజ్జై హరికధను గూర్చె, ముజ్జగములు, యబ్బుర పడ, మూల పురుషుడై. కం************** 2. సంగీత, నాట్య మిళితము, వాంగ్మయ భూషిత, పురాణ భరిత, హరికధన్, వాగ్దేవి కరుణ, నిచ్చెన్, భాగవతోత్తముని భంగిఁ, భక్తితొ, భువికిన్. *************** ఆ.వె3. ఆది భట్టు యదియె యాది నారాయుణౌ, లయ బ్రహ్మ వలె కళలను విరిసె. రాసె వాసి మీర, రామ చంద్ర శతకం, హరి కధామృతమును యరయ ప్రీతి. *************** 4.ఆ.వె. కాళ్ళ గజ్జె కట్టి, కంచు కంఠము తోడ, చిడత గొట్టు లయకు చేవ గూర్చ. సంస్కృతాంధ్ర మందు సరిలేరు వారికి, రాగ నవతి వృతము వ్రాసె భళిగ. *************** 5. ఆ.వె. వన్నె దెచ్చె బిరుదు సాహితీ స్వర బ్రహ్మ. తాత గారు వారు, తనదు(దనర) వృత్తి. కంచు కంఠ మదియె కంఠీరవుని గాంచ, సరసి జాక్షి దయతొ సంగతించ. *************** శీ. P.V..R. మూర్తి గారి అద్భుత పెన్సిల్ చిత్రానికి. ***************


No comments:

Post a Comment