Saturday, 30 January 2016
జనరల్ కె.వి. కృష్ణారావు - శ్రధ్ధాంజలి
శ్రద్ధాంజలి - తెలుగు తల్లి ముద్దుబిడ్డ, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కొటికలపూడి వెంకట కృష్ణారావు (93) శనివారం తుదిశ్వాస విడిచారు. 1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. జులై 11, 1989 నుంచి జనవరి 19, 1990 వరకు తొలిసారి జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండోసారి మార్చి 13, 1993, నుంచి 1998 వరకు గవర్నర్‌గా సేవలందించారు. కేవీ కృష్ణారావు 1923లో విజయవాడలో జన్మించారు. 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో ఆయన సేవలందించారు. బ్రిటిష్ ఇండియా ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆయన యువ ఆఫీసర్‌గా బర్మాలో, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బెలుచిస్తాన్‌లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ ఇచ్చి సత్కరించింది.
Wednesday, 27 January 2016
ఓ.పి.నయ్యర్ - స్వర మాంత్రికుడు - పెన్సిల్ చిత్రం
స్వర మాంత్రికుడు ఓ.పి.నయ్యర్ నా అత్యంత అభిమాన సంగీత దర్శకుడు. వారి మీద అభిమానంతో నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. ఈ మహా సంగీత దర్శకుడు గురించి ప్రముఖ రచయిత్రి గంటి భానుమతి గారు చాల చక్కని వ్యాసం అందించారు. ఈ క్రింది లింకులో వారి వ్యాసం చదవండి.
http://archive.andhrabhoomi.net/content/v-1179Thursday, 21 January 2016
ANR - స్మృత్యంజలి - పెన్సిల్ చిత్రాలు
నేడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి. ఆ మహానటునికి స్మృత్యంజలి ఘటిస్తూ నా పెన్సిల్ చిత్రాల ఆల్బం సమర్పించుకుంటున్నాను.
Tuesday, 19 January 2016
కె. ఎల్. సైగల్ - నివాళి - పెన్సిల్ చిత్రం
మంచుపర్వతాల మీద సాగిపోయే ఒక మనోహర స్వర జలపాతం కె. ఎల్. సైగల్. తాను బతికింది నాలుగు దశాబ్దాలే అయినా, తన విలక్షణ గానంతో కోట్లాది సంగీత ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేశారాయన. తొలిరోజుల్లో రఫీ, ముకేశ్, కిశోర్ ఆయనను అనుకరించడానికి సిద్ధమైనవారే. ‘జబ్ దిల్ హీ టూట్ గయా’ అనే పాట సైగల్ గళ
విశేషానికి ఒక మచ్చు తునక. ‘శాజహాఁ’ సినిమా కోసం మజ్రూహ్ సుల్తాన్‌పురి రాసిన ఈ గీతాన్ని నౌషాద్ స్వరపరిస్తే, సైగల్ తన గాన వైదుష్యంతో ప్రాణం పోసిన వైనాన్ని మరోసారి మనసారా వినండి...
జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీ కే క్యా కరేంగే
జబ్ దిల్ హీ టూట్ గయా....
(మనసే విరిగిపోయాక . నేను జీవించి మాత్రం ఏం చేస్తాను?
మనసే విరిగిపోయాక....)
జీవితంలో ఎన్ని సమకూర్చుకున్నా, ఏం సంపాదించుకున్నా, హృదయ నావలోకి వాటన్నిటినీ చేర్చుకుని హాయిగా సాగిపోవాలని కదా మనిషి ఆశ! లాహిరి లాహిరి లాహిరిలో అంటూ లోకాన్నే మరిచిపోయి ఓలలాడాలని కదా! కానీ, ఆ సమస్తాన్నీ సాకల్యంగా స్వీకరించే హృదయమే తునాతునకలైపోతే, ఇంక జీవితం ఏముంటుంది? జీవితాపేక్ష ఏముంటుంది. అందుకే, ఇంక బతికుండి మాత్రం ఏంచేస్తామనిపిస్తుంది? సరిగ్గా అదే సమయంలో ఒక్కోసారి ఏ ఓదార్పో, ఏ ఆధారమో లభించి హృదయంలో కొత్త ఆశలు మోసెత్తవచ్చు. జీవితం కొత్తగా చిగురించనూ వచ్చు. కాకపోతే ఆ పరిణామాలేవో చోటు చేసుకునేదాకానైతే, ఏముందిలే జీవితం అనిపిస్తుంది. జీవించడంలో అర్థమే లేదనిపిస్తుంది.
ఉల్ఫత్ కా దియా హమ్‌నే,, ఇస్ దిల్ మే జలాయా థా
ఉమ్మీద్ కే ఫూలోఁ సే ఇస్ ఘర్ కో సజాయా థా
ఇక్ భేదీ లూట్ గయా, హమ్ జీ కే క్యా కరేంగే /జబ్ దిల్ హీ/
(ప్రేమ జ్యోతిని నేనీ హృదయంలో వెలిగించాను
ఆశలపూలతో ఈ ఇంటిని అలంకరించాను. కానీ, అయినవారే ఒకరు అంతా కొల్లగొట్టేశారు. నేనింక బతికుండి మాత్రం ఏం చేస్తాను?)
ఏళ్ల పర్యంతంగా రకరకాల చీకట్లలో మ్రగ్గిన హృదయ నావలోకి ఏ ఒక్క కాంతి కిరణం చొరబడినా ఒక పండగే అనిపిస్తుంది. అలాంటిది కోటి దివ్వెల కాంతితో తనరారుతూ తన హృదయ వేదికమీద కదలాడిన ప్రేమను చూస్తే ఏం చేస్తారు? ఆ ప్రేమనొక అఖండ జ్యోతిగా జీవన లోగిలిలో దేదీప్యమానంగా వెలిగించుకుంటారు. ఆ లోగిలినే కాదు మొత్తం భవనాన్నే అనంతమైన ఆశా పుష్పాలతో అలంకరించుకుంటారు. కానీ, అప్పటిదాకా తనవారే అనిపించిన వ్యక్తే తన లోకాన్ని ధ్వంసం చేసేస్తే ఇంకేముంది? కళ్లముందే అంతా కకావికలమై, జీవన వ్యవస్థ అంతా తునాతునకలైపోతుంది. ఆ శిధిలాల కిందినుంచి లేవడం ఇక ఎప్పటికీ సాధ్యం కాదనిపించినప్పుడు ఇంక జీవించడంలో ఏ అర్థమూ లేదనిపిస్తుంది.
మాలూమ్ నా థా ఇత్‌నీ ముష్కిల్ హైఁ మేరీ రాహేఁ
ముష్కిల్ హై మేరీ రాహేఁ
అర్మాన్ కే బహేఁ ఆసూ, హస్‌రత్ నే భరీ ఆహేఁ
హర్ సాథీ ఛూట్ గయా హమ్ జీ కే క్యా కరేంగే / జబ్ దిల్ హీ /
(నా దారులు ఇంత కఠినతరమని తెలియదు నాకు
ఆశల కన్నీళ్లు పారాయి, ఆకాంక్షలు దారుల్లో నిట్టూర్పులే నింపాయి
ప్రతి మిత్రుడూ వెళ్లిపోయాడు.. నేనింక బతికుండి మాత్రం ఏం చే స్తాను?)
తాము నడిచి వెళ్లే దారిలో ఎన్నెన్ని బాధలు ఉంటాయో ఎలప్రాయంలో ఎవరికీ ఏమీ తెలియదు. అందుకే ప్రతి విఘాతానికీ హృదయం విలవిల్లాడుతుంది. ఆశలన్నీ కన్నీటిమయం అవుతున్నప్పుడు, ఆకాంక్షలన్నీ నిట్టూర్పుల మయం అవుతున్నప్పుడు జీవితం శోక సముద్రమే అవుతుంది. ఇతరమైన ఐశ్వర్యాలూ, ఆనందాలూ ఎన్ని పోయినా, కనీసం స్నేహితులైనా కడదాకా మనతో ఉండిపోవాలని కోరుకుంటాం.. కానీ, ఆ స్నేహితులు కూడా దూరమైపోతే, జీవించడంలో అర్థమేం కనిపిస్తుంది. కాకపోతే ఒక చోట హృదయం ముకుళించుకుపోతే మరోచోట అది వికసిస్తుంది. ఒక చోట ప్రాణరహితంగా కనిపించే హృదయమే ఒకచోట అనంతమమైన చైతన్యంతో తొణకిసలాడుతుంది. ఈ నిజాన్నే మనం తరుచూ విస్మరిస్తూ ఉంటాం. అడుగడుగునా అంతులేని నైరాశ్యానికి లోనవుతాం. నిజానికి అన్నీ తెలిసిన ఆత్మ ఘటనాఘటనాలకు అతీతంగా సాగిపోతూనే ఉంటుంది. సుఖదుఃఖాలకు అతీతంగా జీవనయానాన్ని
కొనసాగిస్తూనే ఉంటుంది.
(ఆంధ్రజ్యోతి 19th జనవరి 2016 సౌజన్యం తో)
Sunday, 17 January 2016
ఎన్టీఆర్ - బ్రహ్మనాయుడు - పల్నాటియుద్దం - పెన్సిల్ చిత్రం
ఈ రోజు మహానటుడు ఎన్టీఅర్ వర్ధంతి. ఆ మహానటునికి స్మ్రుతంజలి ఘటిస్తూ నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. పోషించిన పాత్ర : బ్రహ్మనాయుడు, చిత్రం : పల్నాటియుద్దం. నేను ఎన్నో తెలుగేతర చిత్రాలు చూసాను. కాని మన ఎన్టీఅర్ పోషించిన ఇటువంటి పాత్రలు అంత సమర్ధవంతంగా పోషించిన మరొక నటుడిని చూడలేదు. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం కారణంగా వారు తెలుగు చిత్రసీమ కి అందించిన సేవలకు గుర్తింపుగా అందవలసినన్ని పురస్కారాలు అందలేదు. కాని తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు, నాయకుడు ఎన్టీఅర్ ఒక్కడే. అందుకే ఆయనన యుగపురుషుడు గా తెలుగు ప్రజలచే కీర్తింపబడుతున్నాడు.
Saturday, 2 January 2016
హరికధా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు - స్మృత్యంజలి
అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (Ajjada Adibhatla Narayana Dasu) ప్రముఖ హరికథా కళాకారుడు,సంగీతం,సాహిత్యం మరియు న్రుత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని స్రుజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు.సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం.
1864 ఆగష్టు 31 న ఇప్పటి విజయనగరం జిల్లా, బొబ్బిలి వద్ద, ప్రస్తుతం బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ, వేంకటచయనులు దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక, ఆయన నారాయణదాసుగా ప్రఖ్యాతిగాంచాడు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా, పద్యాలు, శ్లోకాలు విని, కంఠతా పట్టి తిరిగి వల్లించేవాడు.
కేవలం ఐదేళ్ళ చిరు ప్రాయంలోనే, భాగవతం లోని పద్యాలు ఎన్నో చెప్పేవాడట. ఒకసారి వారి అమ్మగారు పిల్లవాడిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్ళిందట. అక్కడ పుస్తకాల కొట్టులో, భాగవతం చూసి (బాల దాసు)అది కావాలి అని మారాం చేస్తుంటే, ఆ కొట్టు యజమాని, భాగవతం నీకేమి అర్థమవుతుంది అన్నాడట. అంతే ఆ కుర్రవాడు ఆపకుండా భాగవతం లోని పద్యాలు గడగడా చెప్పేశాడట. అది చూసి, ఆ కొట్టు యజమాని ఆనందంగా పిల్లవానికి ఆ పుస్తకం తో పాటు, కొంత దక్షిణ కూడ ఇచ్చి పంపించాడుట.
ఇది ఇలా ఉండగా, ఒకసారి దాసు వాళ్ళ తాతగారింటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే, అది చూసి వాళ్ళ తాతగారు ముచ్చటపడి, తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పాడట. దాంతో అప్పటిదాకా, ఎటో సాగుతున్న నావకి చుక్కాని దొరికినట్లైంది. ఒకప్రక్క సంగీత సాధన, ఇంకో ప్రక్క విద్యాభ్యాసం. ఇలా రెంటినీ అతను ఎంతో నేర్పుగా సంబాళించగలిగాడు. (వికీపెడియా నుండి సేకరణ)
ఈ బొమ్మ చూసి శ్రీమతి శశికళ ఓలేటి గారు తన పద్యాల ద్వారా ఇలా స్పందించారు :
Subscribe to:
Posts (Atom)